కలం, సూర్యాపేట : సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రం, సుందరయ్య నగర్ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు ప్రసన్నకుమార్ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా ఈ విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు. పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, ఎస్సైల ఆధ్వర్యంలో దాదాపు 80 మంది పోలీస్ సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కాలనీలోని ప్రతి ఇంటిని కూలంకషంగా తనిఖీ చేశారు. ఇతర ప్రాంతాలు లేదా రాష్ట్రాల నుంచి వచ్చిన నేరస్థులు ఎవరైనా ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారా..? దొంగతనానికి గురైన వాహనాలు ఉన్నాయా..? అనే కోణంలో తనిఖీలు సాగాయి.
తనిఖీలలో సరైన పత్రాలు లేకుండా ఉన్న 65 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా తనిఖీలు చేయగా, గత నేర చరిత్ర ఉన్న నలుగురు అనుమానితులను గుర్తించినట్లు సమాచారం. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రజలతో మాట్లాడి, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. ఈ భారీ సర్చ్ ఆపరేషన్‌లో ఎస్సైలు ఏడుకొండలు, మహేందర్ నాథ్, శివతేజ, ఐలయ్య, బాలు నాయక్, సైదిరెడ్డి, కనకరత్నం, వెంకన్నలతో పాటు ఏఎస్ఐలు నరేందర్ రెడ్డి, ముత్తయ్య, వెంకన్న, స్పెషల్ పార్టీ సిబ్బంది, పట్టణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: ‘టెర్మినాలియా టోమెంటోసా’.. దాహాన్ని తీర్చే అద్భుత వృక్షం!
Follow Us On: Instagram

