డైనోసార్ల ప్రపంచంలోకి నారా దేవాన్ష్: నారా లోకేశ్‌ ఆసక్తికర పోస్ట్‌!

కలం, వెబ్‌ డెస్క్ : ఉదయం నిద్ర లేవగానే చుట్టూ డైనోసార్ పుస్తకాలు, పెయింటింగ్‌లు, బొమ్మలు కనిపించడంతో ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యానంటూ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. తన కుమారుడు దేవాన్ష్ (Nara Devaansh) సృష్టించిన ఆ ప్రాచీన ప్రపంచం వెనుక ఉన్న రహస్యాన్ని ఆ తర్వాత బయటపెట్టారు. నారా దేవాన్ష్ డినో డీట్స్ (Dino Deets) పేరుతో కొత్తగా యూట్యూబ్ చానల్ ప్రారంభించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విడుదల చేసిన టీజర్‌లో తండ్రి లోకేష్ సైతం భాగస్వామ్యమయ్యారు. చానల్ ప్రారంభించిన దేవాన్ష్‌కు నారా, నందమూరి కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ డినో డీట్స్ టీజర్‌లో మంత్రి నారా లోకేష్ స్వయంగా పాల్గొని, దేవాన్ష్ ప్రారంభించబోయే యూట్యూబ్, పాడ్‌కాస్ట్ ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. డైనోసార్లు, శిలాజాలు (Fossils), పురాతన అవశేషాల గురించి తాను తెలుసుకున్న ఆశ్చర్యపరిచే నిజాలను దేవాన్ష్ ఇందులో వివరించనున్నారు. డైనోసార్ల వింతలు, విశేషాలను ఆకట్టుకునే శైలిలో, నవ్విస్తూ, ఆలోచింపజేసేలా అందించే పాడ్‌కాస్ట్‌లు ఈ చానల్ ద్వారా వీక్షకులకు అందుతాయి. దేవాన్ష్ సృష్టించిన ఈ ప్రాచీన ప్రపంచంలోకి ఒక ప్రేక్షకుడిలా ప్రవేశించేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు లోకేష్ పేర్కొన్నారు.

యూట్యూబ్ చానల్ ద్వారా సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నారా దేవాన్ష్ (Nara Devaansh) ఇదివరకే అసాధారణ ప్రతిభను చాటుకున్నారు. చదరంగంలో క్లిష్టమైన 175 పజిల్స్‌ను అత్యంత వేగంగా పరిష్కరించడం ద్వారా ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్‌గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. ‘5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్’ పుస్తకంలోని సంక్లిష్టమైన పజిల్స్‌ను గతేడాది వేగంగా ఛేదించి ఈ అరుదైన రికార్డును దేవాన్ష్ తన సొంతం చేసుకున్నారు.

Read Also: బండి సంజయ్‌ కేంద్రమంత్రి పదవిలో కొనసాగడం అవమానకరం : కేటీఆర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>