Mobile Popup Ad
Mobile Popup Ad

బండి భగీరథ్ ఆడియో వైరల్!!

కలం, వెబ్ డెస్క్ : కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కొడుకు బండి సాయి భగీరథ్ (Bandi Bageerath) పై పోక్సో కేసు నమోదు అయింది. హైదరాబాద్ కు చెందిన ఓ మైనర్ కు బలవంతంగా మద్యం తాగించి లైంగికదాడి చేశారని ఆరోపణలు వస్తున్నాయి. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఆయన పై పోక్సో కేసు నమోదయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బండి భగీరథ వాయిస్ అంటూ సోషల్ మీడియాలో ఓ ఆడియో వైరల్ అవుతుంది. ఈ ఆడియోను బీఆర్ఎస్ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది.

ఆడియోలో వినిపిస్తున్న ఆడియో భగీరథ్ దేనని వారు ఆరోపిస్తున్నారు. దీంతో బండి సంజయ్ పై రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. రేపు జరగబోయే ప్రధాని నరేంద్ర మోదీ సభలో భగీరథ్ పై వస్తున్న ఆరోపణలపై బండి సంజయ్ సమాధానం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ‘ఆడియో నీ కొడుకుది కాదని నిరుపించాలి. భాగ్యలక్షి గుడికి వచ్చ ఒట్టు వేస్తావా? లేదా యాదగిరి గుట్టకు వెళ్లి ఒట్టు వేస్తావా?’ అని బండి సంజయ్ పై ప్రత్యర్థులు సవాల్ విసురుతున్నారు. ఈ వ్యవహారంపై బండి సంజయ్, బీజేపీ నేతలు ఇంకా స్పందించకపోవడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>