Mobile Popup Ad
Mobile Popup Ad

మరో సంచలన వివాదంలో బండి సంజయ్ కొడుకు

కలం, వెబ్ డెస్క్ : కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్  (Bandi Sanjay Son Bageerath) మరో సంచలన వివాదంలో చిక్కుకున్నారు. హనీ ట్రాప్‌లో పడి బ్లాక్ మెయిల్‌కు గురవుతున్నట్లు కరీంనగర్ పోలీస్ స్టేషన్‌లో భగీరథ్ ఫిర్యాదు చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశారని.. నిరాకరించడంతో ఇద్దరి మెసేజ్‌లు, వీడియోల ద్వారా రూ.5 కోట్లు ఇవ్వాలని తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని హైదరాబాద్‌కు చెందిన ఆ కుటుంబంతో పాటు అమ్మాయిపై భగీరథ్ కంప్లైంట్ చేశాడు. ఇప్పటికే రూ.50 వేలు ఆ కుటుంబానికి ఇచ్చానని ఆయన ఫిర్యాదులో పేర్కొనాడు.

అయితే, ఆ అమ్మాయి కుటుంబం భగీరథ్‌పై అంతకుముందే ఫిర్యాదు చేసింది. ఆ అమ్మాయి మైనర్ అని ఇది పోక్సో కేసుగా మారే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ కుటుంబం హైదరాబాద్‌లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని సమాచారం. రెండు వైపులా ఆరోపణలు ఉండటంతో అసలు నిజం ఏమిటో పోలీసు దర్యాప్తు తర్వాతే తేలనుంది. బండి సంజయ్ కుమారుడు దోషి అయ్యాడా లేదా మైనర్ అమ్మాయి వలలో చిక్కుకున్న అమాయకుడా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు రెండు ఫిర్యాదులపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, గతంలో ర్యాగింగ్ కేసులో బండి భగీరథ్ పై కేసు నమోదు అయింది. విద్యార్థిపై దాడికి సంబందించిన వీడియో వైరల్ కావడంతో దుండిగల్ పోలీసులు అతనిపై చర్యలు తీసుకున్నారు. తాజాగా, మైనర్ ను మోసం చేశాడనే ఆరోపణలు రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>