మహిళా రిజర్వేషన్లపై కుట్రలు: బండి సంజయ్

కలం, వెబ్ డెస్క్: మహిళా రిజర్వేషన్లపై (Women Reservations) కొన్ని పార్టీలు కుట్రలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శలు గుప్పించారు. నియోజకవర్గాలు పెరిగితే దక్షిణాదికి నష్టం జరుగుతుందంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టారని ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సీట్ల పెంపుతో దక్షిణాదికి నష్టమంటూ సీఎం రేవంత్ రెడ్డి కొత్త నాటకం మొదలుపెట్టారని పేర్కొన్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయిస్తే నష్టమేంటని ప్రశ్నించారు. అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల సంఖ్య పెంపుతో ‘దక్షిణాది’కి నష్టమంటూ కొత్త ప్రచారానికి తెరలేపారని ఫైర్ అయ్యారు.

ప్రాంతీయ అసమానతల పేరుతో డ్రామాలు

దేశంలో ప్రాంతీయ అసమానతలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని కొన్ని పార్టీలు చూస్తున్నాయని బండి ఫైర్ అయ్యారు. ఇంకెన్నాళ్లు ప్రాంతీయ అసమానతల పేరు చెప్పి చలి కాచుకుంటారని ప్రశ్నించారు. ‘దేశాన్ని విభజించాలని చూస్తున్నారా?’ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల్లో దేశభక్తి, జాతీయవాదం మచ్చుకైనా కనిపించడం లేదని విమర్శించారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమి ఓడిపోతుందనే తెలిసి కొత్త కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. తమిళనాడు, కేరళ ప్రజలు విజ్ఞులు….కర్రుకాల్చి వాత పెట్టేందుకు సిద్ధమయ్యారని బండి సంజయ్ (Bandi Sanjay) పేర్కొన్నారు.

మహిళలంటే ద్వేషమా?

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే నష్టమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి (Revanth Reddy) మహిళలను ద్వేషిస్తున్నారని విమర్శించారు. అందుకే 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. ‘మహిళా రిజర్వేషన్ల ద్వేషులతో జత కట్టారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కాపీలను చింపేసిన ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీలతో అంటకాగుతున్నారు. మీరెన్ని కుట్రలు చేసినా, విభజన రాజకీయాలు చేసినా మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తాం’ అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు.

Read Also: నోట్ల రద్దు, కరోనా తర్వాత.. మరోసారి మోదీ కీలక స్టెప్..!

Follow Us On: Instagram

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>