వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఆ జిల్లాలో అతిభారీ వర్షాలు!

కలం, వెబ్ డెస్క్ : ఎండాకాలంలో వర్షాలతో రాష్ట్రం ఒకపక్కన చల్లగా మారుతున్నా.. మరోపక్క పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. మంగళవారం హైదరాబాద్ నగరంలో వడగండ్ల వర్షం కురిసింది. ఈరోజు కూడా పట్టణంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ (IMD) కీలక ప్రకటన (Weather Alert) చేసింది. రాష్ట్రంలో రాబోయే 2 నుంచి 3 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే, హైదరాబాద్, మేడ్చల్, మంచిర్యాల, నారాయణపేట్, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Read Also: పార్టీ ఏర్పాటుపై శ్రీరామనవమి రోజున కవిత ప్రకటన?

Follow Us On : WhatsApp

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>