కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైందని.. ఆ పార్టీలో వర్గ పోరు జరుగుతోందని కాంగ్రెస్ నేత, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) సంచలన ఆరోపణలు చేశారు. దాదాపు ఏడాది తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తున్నారని.. ఈ సమయంలో హరీశ్ రావు జగిత్యాలకు రాకుండా ఢిల్లీ ఎందుకు వెళ్లాడని ప్రశ్నించారు. కవిత మొదటి నుంచి హరీశ్ రావు (Harish Rao) గురించి చెపుతూనే ఉందని.. చివరకు ఆమెనే పార్టీ వదిలిపెట్టిపోయిందన్నారు. హరీశ్ రావు ఇప్పుడు ఢిల్లీ కి పోయాడని.. ఆయన ఎందుకు ఢిల్లీ పోయాడో తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
హరీశ్ రావు (Harish Rao) ఢిల్లీలో ఏ పార్టీని సంప్రదిస్తున్నాడనే విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలిపోయే అవకాశం కనిపిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రజాశీర్వాద సభ కోసం అక్రమ డబ్బుతో జగిత్యాలతో జనసమీకరణ చేస్తున్నారంటూ ఆరోపించారు. జీవన్ రెడ్డి భుజంపై తుఫాకీ పెట్టి ప్రభుత్వాన్ని తిట్టాలని చూస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కుట్ర, అక్కసు, కుతంత్రం ఎందుకు? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సీటు అంటే గౌరవం లేకుండా అహంతో కేటీఆర్ మాట్లాడుతున్నాడని మంత్రి అడ్లూరి (Adluri Laxman) విమర్శించారు.
Read Also: ప్రధాని మోదీ ఆదేశం.. సౌదీ వెళ్లిన అజిత్ దోవల్
Follow Us On : WhatsApp

