కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) శంకుస్థాపన చేశారు. రూ.20 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డును ప్రారంభించారు. బీరప్ప ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరగా.. నిధులు మంజూరుకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎంపీవో జగన్మోహన్ రెడ్డి, గ్రామ కార్యదర్శి అభినవ్, సర్పంచి రమేష్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ గౌడ్, ఉప సర్పంచ్ రాకేష్, వార్డు మెంబర్లు అనిల్, సంపత్ ,రాము, శ్రీనివాస్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

