‘మాస్ జెన్ జెడ్’ పాట రిలీజ్ చేసిన బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: ప్రధాని మోదీ 12 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్బంగా బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో ‘మాస్ జెన్ జెడ్ ర్యాప్’ సాంగ్ రూపొందించారు. బుధవారం నాడు కరీంనగర్ శ్రీ మహాశక్తి దేవాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) పాటను విడుదల చేశారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. దేశం, యువత కోసం నిర్విరామంగా పనిచేస్తున్న మోదీపై రూపొందించిన పాట బాగుందని కొనియాడారు. మోదీ యువత కోసం ప్రవేశపెట్టిన అనేక పథకాలను బీజేవైఎం ఆధ్వర్యంలో వారికి చేరవేసేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.

Read Also: అవినీతి నిరూపిస్తే రాజీనామా: అడ్లూరి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>