‘NBK111’ గ్లింప్స్ రిలీజ్.. బాలయ్య మాస్ స్వాగ్ వైరల్

కలం, సినిమా : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna), స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్‌లో మరో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. “NBK111” వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి నేడు బాలయ్య బర్త్‌డే సందర్భంగా మేకర్స్ పవర్ఫుల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. 91 సెకన్ల నిడివి గల ఈ గ్లింప్స్ వీడియో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. బాలయ్య సరికొత్త మెకోవర్ ఫ్యాన్స్‌కి  పిచ్చ కిక్ ఇచ్చింది.

ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్‌లో సాగే కథ కావడంతో బాలయ్యని దర్శకుడు గోపీచంద్ మలినేని సరికొత్తగా ప్రెజెంట్ చేశారు. థమన్ మరోసారి బాలయ్య సినిమాకి అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. నిర్మాత సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో (NBK111) మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, ఈ ఎంట్రీ వీడియోతో హైప్ మరింత పెరిగింది.

Read Also: ‘పెద్ది’ టికెట్​ ధర పెంపును వ్యతిరేకిస్తూ హైకోర్ట్​లో పిటిషన్​!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>