Mobile Popup Ad
Mobile Popup Ad

పరారీలో బండి సంజయ్ కుమారుడు భగీరథ్.. రంగంలోకి పోలీసులు!

కలం, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు బండి భగీరథ్ అరెస్ట్ భయంతో మూడు రోజులుగా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. తనపై నమోదైన పోక్సో (POCSO) కేసు విచారణ నేపథ్యంలో ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి, అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఈ కేసుపై విచారణాధికారిణి రితిరాజ్ స్పందిస్తూ.. నిందితుడు ప్రస్తుతం పరారీలో (Missing) ఉన్నాడని, అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని తెలిపారు. భగీరథ్ కాల్ డేటా రికార్డులను (CDR) క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్‌ను రికార్డ్ చేశామని, అయితే కేసులోని మరిన్ని లోతైన వివరాల కోసం మరోమారు ఆమె స్టేట్మెంట్‌ను సేకరించాల్సి ఉంటుందని అధికారిణి వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>