రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదు.. మంత్రి జూపల్లి వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేసి అన్నదాతలకు ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. ఇవాళ వనపర్తి జిల్లా కేంద్రంలోని కల్యాణ సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో యాసంగి సీజన్‌ వరి, మొక్కజొన్న కొనుగోళ్లపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లోనే నిబంధనల ప్రకారం నాణ్యతను పరిశీలించి, తూకం వేయాలన్నారు. అక్కడే దగ్గరే రైతులకు రశీదులు అందజేయాలని చెప్పారు. రైతులు లారీల వెంబడి మిల్లుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండకూడదని.. ఆవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తరుగు, తాలు వంటివన్నీ కేంద్రాల వద్దే తేల్చాలని స్పష్టం చేశారు. మిల్లుకు వెళ్లాక తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>