కలం, కరీంనగర్ బ్యూరో : పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల తరువాత బీజేపీ జాతీయ నాయకత్వం మొత్తం తెలంగాణపైనే దృష్టి సారించబోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) కీలక ప్రకటన చేశారు. బుధవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో బీజేపీ నాయకులను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు.
వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని బండి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ గెలుపుతో ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ లక్ష్యాన్ని సంపూర్ణం చేస్తామని తెలిపారు. బీజేపీ కార్యకర్తల త్యాగాలు, పోరాటాలతో కమ్యూనిస్టు కంచుకోట కేరళ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించిందన్నారు.
బెంగాల్ లో బీజేపీ కార్యకర్తల ఇండ్లను ధ్వంసం చేస్తున్నా, మహిళా మోర్చా కార్యకర్తలపై అత్యాచారం చేసినా వెనకంజ వేయకుండా బెంగాల్ ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూ వెన్నులో వణుకు పుట్టిస్తున్నారని చెప్పారు. బీజేపీ హైకమాండ్ దృష్టి అంత త్వరలోనే తెలంగాణపై కేంద్రీకృతం చేయబోతోందని, బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఎవరూ ఆపలేరని సంజయ్ (Bandi Sanjay Kumar) అన్నారు.
Read Also: మరోసారి కూల్చివేతల పర్వం.. గడ్డకట్టే చలిలో ఈడ్చి పారేశారు
Follow Us On: X(Twitter)


