కలం, వెబ్ డెస్క్: గిగ్ వర్కర్లు (Gig Workers) లేదా డెలివరీ బాయ్స్ జీవితం అత్యంత దుర్బరం. ముంచుకొచ్చే డెడ్ లైన్, చాలీచాలనీ జీతంతో వారి రోజువారీ జీవితం దినదిన గండమే. ఇక ముంచుకొచ్చే డెడ్‌లైన్ వారికి మరణశాసనంలా మారుతోంది. కొన్ని ఈ కామర్స్ సంస్థలు 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని ప్రకటిస్తుంటాయి. ఆ మేరకు డెలివరీ బాయ్స్‌కు డెడ్ లైన్ విధిస్తుంటాయి. దీంతో సకాలంలో డెలివరీ చేయాలన్న కారణంతో గిగ్ వర్కర్లు నరకయాతన అనుభవిస్తున్నారు.
వినియోగదారులు కూరగాయలో, ఇతర సరుకులో ఆర్డర్ చేసినప్పుడు వాటిని కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ట్రాఫిక్ జామ్, గోదాముల్లో సరుకులు అందుబాటులో ఉండకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో డెలివరీ బాయ్స్ (Gig Workers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గిగ్ వర్కర్లు వేగవంతమైన డెలివరీ కోసం ప్రక్కపక్కన రోడ్లపై, ట్రాఫిక్ మధ్యలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నడిరోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నాయి. రాంగ్ రూట్లో వెళితే చలాన్లు కట్టాల్సి వస్తోంది. అదనంగా, కొన్నిసార్లు గిగ్ వర్కర్లు సరుకులు అందుకోవడానికి గోదాముల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. ఈ కామర్స్ సంస్థల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో 10 నిమిషాల్లోనే డెలివరీ చేయాలన్న డెడ్ లేన్ డెలివరీ బాయ్స్ కొంప ముంచుతోంది. ప్రభుత్వం గిగ్ వర్కర్ల సమస్యపై గట్టిగా దృష్టి సారించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Read Also: షాకింగ్: కవిత వాహనంపై 16 డేంజరస్ డ్రైవింగ్ చలాన్లు
Follow Us On: Youtube


