కలం, కరీంనగర్ బ్యూరో : ఓపెన్ జిమ్ లను ఉపయోగించుకుని శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay Kumar) సూచించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ’ఫిట్ ఇండియా’ నినాదాన్ని పురష్కరించుకుని కరీంనగర్ ప్రజలకు ఓపెన్ జిమ్ లు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు కోటి రూపాయల వ్యయంతో 17 డివిజన్లలో ఓపెన్ జిమ్ లను ఏర్పాటవుతున్నాయి. నాల్కో సంస్థ అందిస్తున్న సీఎస్సార్ నిధుల సహకారంతో మలయప్ప ఫౌండేషన్ నిర్వాహకులు ఈ ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేస్తున్నారు.
అందులో భాగంగా మంగళవారం నగరంలోని కిసాన్ నగర్ అంబేద్కర్ యూత్ క్లబ్ సమీపంలో, దుర్శేడులో నూతనంగా ఏర్పాటు చేసిన రెండు ఓపెన్ జిమ్ లను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) ప్రారంభించారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, స్థానిక కార్పొరేటర్లు ఆయన వెంట ఉన్నారు.
Read Also: బీజేపీ కీలక నిర్ణయం.. బెంగాల్ కు మహిళ సీఎం.. !
Follow Us On : WhatsApp

