IPS విశాల్ గున్నికి ఏపీ హైకోర్టు బిగ్ షాక్

కలం, వెబ్ డెస్క్ : ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని ( IPS Vishal Gunni ) కి ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. సినీ నటి కాదంబరి జత్వాని అక్రమ అరెస్ట్ కేసులో విశాల్ గున్ని సస్పెన్షన్ ను రద్దు చేస్తూ క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. కేసులో లోతైన విచారణ అవసరమని అభిప్రాయపడిన హైకోర్టు.. తదుపరి విచారణను జులై 6కి వాయిదా వేసింది.

వివరాల్లోకి వెళ్తే.. సినీ నటి కాదంబరి జత్వాని (Kadambari Jethwani) అక్రమ అరెస్ట్, అధికార దుర్వినియోగం కేసులో విశాల్ గున్నిని (IPS Vishal Gunni) కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ అంశంపై విశాల్ గున్ని క్యాట్‌ను ఆశ్రయించారు. దీంతో విశాల్ గున్నిపై సస్పెన్షన్ ఎత్తివేసి తక్షణమే ఆయన్ని విధుల్లోకి తీసుకోవాలని 2025 ఆగస్ట్‌లో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే క్యాట్ ఉత్తర్వులను రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ, డీజీపీ హైకోర్టులో సవాల్ చేశారు. మంగళవారం పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏపీ హైకోర్టు తాజా తీర్పు వెలువరించింది.

Read Also: అవినీతి ఆరోపణలు.. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతికి బిగ్ షాక్

Follow Us On :  WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>