కలం, వెబ్ డెస్క్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) పలు మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా హ్యాండిళ్లపై పరువు నష్టం దావా వేశారు. బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి.. తనపై అసత్య ప్రచారాలు చేశారని వాటికి లీగల్ నోటీసులు పంపించారు. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే.. పరువు నష్టం కేసును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. తనపై పదే పదే అవాస్తవాలు ప్రచారం చేసి, పరువుకు భంగం కలిగించారని ఆవేదన వ్యక్తం చేశారు. దుష్ప్రచారం కారణంగా తాను తీవ్ర మనోవేదనకు గురైనట్లు వివరించారు. ఈ నేపథ్యంలో.. ఏయే ఛానళ్లపై పరువు నష్టం దావా కేసు వేశామో వివరిస్తూ.. ఆయన తరఫు లాయర్లు ఒక ప్రకటన విడుదల చేశారు.
Read Also: ప్రజాస్వామ్య హక్కులను బీజేపీ విస్మరిస్తోంది : ఎంపీ కావ్య
Follow Us On: Instagram

