Mobile Popup Ad
Mobile Popup Ad

అమెరికా ఫస్ట్ వర్సెస్ ఇండియా ఫస్ట్: జైశంకర్ హాట్ కామెంట్స్

కలం, వెబ్‌ డెస్క్ : భారత్, అమెరికా దేశాల విదేశాంగ విధానాలపై భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ (Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రూబియోతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం తమ విదేశాంగ విధానాన్ని ‘అమెరికా ఫస్ట్’ అని చాలా స్పష్టంగా ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. అదే సమయంలో తాము కూడా ‘ఇండియా ఫస్ట్’ అనే ఆలోచనతోనే ఉన్నామని వివరించారు. ఇరు దేశాలు తమ తమ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నాయని ఆయన స్పష్టం చేశారు.

ఇంధన భద్రత అంశంపై కూడా జైశంకర్ (Jaishankar) ప్రత్యేకంగా మాట్లాడారు. దేశ ఇంధన భద్రత కోసం భారత్‌కు నమ్మకమైన, చౌకైన, పెద్ద ఎత్తున లభించే బహుళ వనరులు అవసరమని పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికా మనకు సరిగ్గా సరిపోతుందని అభిప్రాయపడ్డారు. కొన్ని ఇతర దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయని చెప్పారు. చివరకు ప్రజలకు సరసమైన ధరలకే ఇంధనాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. అందుకే అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన సరఫరా వనరులను తాము కొనసాగిస్తామని జైశంకర్ వెల్లడించారు.

Read Also: ఉక్రెయిన్‌పై రష్యా మిసైల్ దాడి!

Read Also: ఆమెకు రక్షణేది..?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>