epaper
Wednesday, February 18, 2026
epaper

అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం : బండి సంజయ్​

కలం, వెబ్​ డెస్క్​ : కరీంనగర్​ కార్పొరేషన్​ (Karimnagar Corporation) లో బీజేపీకి అధిక సీట్లు రావడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆనందం వ్యక్తం చేశారు. కరీంనగర్​ కార్పొరేషన్​ లో గెలవడం గొప్ప విషయం అని, రాబోయే ఐదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. ఈ సంతోషం పట్టలేకపోతున్నారన్నారు. ఓ లక్ష్యాన్ని ఎంచుకుని దాని ప్రకారం కలిసి పని చేసినట్లు తెలిపారు. ‘బండి సంజయ్​ కరీంనగర్ కు ఎన్ని నిధులు తీసుకువచ్చాడు.. ఏం చేశారు’ అని ప్రశ్నించిన వారికి ప్రజలు గట్టి దెబ్బ కొట్టారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలు అవసరం లేదని.. కరీంనగర్​ లో బీజేపీకి మద్దతు తెలిపారని బండి పేర్కొన్నారు. గెలుపు కేవలం రాజకీయం కాదని, ప్రజలు తమపై గురుతర బాధ్యత పెట్టారన్నారు. ఉచిత హామీలు, ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వకున్నా ప్రజలకు తమపై ఉన్న విశ్వాసంతో గెలిపించారని బండి సంజయ్​ (Bandi Sanjay) తెలిపారు.

Read Also: ఆ జిల్లాలో బీజేపీ కింగ్‌మేక‌ర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>