epaper
Wednesday, February 18, 2026
epaper

వారణాసి : బిగ్ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి..

కలం, సినిమా : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “వారణాసి” (Varanasi). దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కే.ఎల్ నారాయణ నిర్మాణంలో దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో  తెరకెక్కుతుంది. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళం స్టార్ హీరో పృద్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

వారణాసి (Varanasi) మూవీని ఏప్రిల్ 7, 2027 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఇదిలా ఉంటే తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. వారణాసి సినిమా షూట్ 50% పూర్తి అయ్యింది. సినిమాలో రామాయణ ఎపిసోడ్ పూర్తిగా షూట్ చేసి, ప్రస్తుతం VFX కోసం పంపించినట్లు తెలిపారు. అలాగే ఈ సినిమాలో పాటలు ఉంటాయి.. కానీ “నాటు నాటు” తరహాలో ఉండవని రాజమౌళి స్పష్టం చేశారు.

Read Also: అల్లు శిరీష్-నయనిక పెళ్లి పనులు షురూ.. అల్లు-మెగా ఫ్యామిలీ సందడి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>