epaper
Wednesday, February 18, 2026
epaper

ఆ జిల్లాలో బీజేపీ కింగ్‌మేక‌ర్

కలం, మెదక్ బ్యూరో: ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలోని ప‌లు మున్సిపాలిటీల్లో (Medak)  బీజేపీ కింగ్ మేక‌ర్‌గా అవ‌త‌రించింది. న‌ర్సాపూర్ మున్సిపాలిటి (Narsapur Municipality) ప‌రిధిలో మొత్తం 15 వార్డులు ఉండ‌గా కాంగ్రెస్ 6, బీఅర్ఎస్ 5, బీజేపీ 4 వార్డుల్లో గెలుపొందింది. ఏ పార్టీకి కుడా సంపూర్ణ మెజార్టీ రాలేదు. మ్యాజిక్ ఫిగ‌ర్ 8ని ఏ పార్టీకి సాధించ‌లేదు. దీంతో ఏవైనా రెండు పార్టీలు కలిస్తేనే చైర్మన్‌ను ఎన్నుకొనే పరిస్థితి ఉంది. దీంతో బీఆర్ఎస్ – బీజేపీ క‌లుస్తాయా? లేదంటే కాంగ్రెస్ – బీజేపీ కలుస్తాయా? అన్నది ఆసక్తి కరంగా మారింది.

మెద‌క్ మున్సిపాలిటీలో (Medak Municipality) బీఆర్ఎస్ 15 , కాంగ్రెస్ 14, బీజేపీ2, బీఎస్పీ ఒక్క స్థానంలో గెలుపొందింది. అయితే బీఎస్పీ నుంచి గెలిచిన అరుణ కాంగ్రెస్ కండువా క‌ప్పుకొవ‌డంతో కాంగ్రెస్ బ‌లం 15‌కు పెరిగింది. చైర్మ‌న్ ప‌ద‌వి అధిష్ఠించాలంటే మ్యాజిక్ ఫిగ‌ర్ 17కు చేరాలి. కానీ బీఅర్ఎస్‌‌కు, కాంగ్రెస్‌కు ఇద్ద‌రు సభ్యులు త‌క్కువ అయ్యారు. దీంతో బీజేపీకి ఇద్దరు కౌన్సిల‌ర్లు ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తే వారే చైర్మ‌న్ అయ్యే అవ‌కాశం ఉంది. మెద‌క్ ఎమ్మెల్యే మైనంప‌ల్లి రోహిత్ ఎక్స్ అఫిషియో‌గా మ‌ద్ధ‌తునిచ్చిన మ‌రో స‌భ్యుడు త‌క్కువ అవుతాడు. ఏ విధంగా చూసిన బీఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీ స‌పోర్ట్ త‌ప్ప‌నిస‌రిగా మారి.. బీజేపీ కింగ్ పింగ్ ఉంది. అయితే బీజేపీ మాత్రం త‌మ‌కు న‌ర్సాపూర్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చేవారికే .. మెద‌క్‌లో మ‌ద్ద‌తు ఇస్తామని చెప్పిన‌ట్టు స‌మాచారం.

దీంతో న‌ర్సాపూర్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వ‌డానికి బీఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీల‌లో ఎవ‌రు ముందుకు వ‌స్తే వారికే బీజేపీ మ‌ద్ద‌తు ఇచ్చే అవ‌కాశం ఉంది. ఇలా న‌ర్సాపూర్, మెద‌క్‌లో అనివార్యంగా బీజేపీ మద్దతు  లేకుండా చైర్మ‌న్ల ఎంపిక కాని ప‌రిస్ధితి ఉండ‌టంతో కింగ్‌మేక‌ర్‌గా డ్రైవింగ్ సీట్‌లో ఉన్నారు. న‌ర్సాపూర్ చైర్మ‌న్ ప‌ద‌వి‌, మెద‌క్‌లో వైస్ చైర్మ‌న్ ప‌ద‌విని ఎవ‌రు ఇస్తారో వారికే త‌మ మ‌ద్ధ‌తు ఉంటుంద‌నే స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

సంగారెడ్డి జిల్లా‌లో హంగ్ ప‌రిస్దితి ఉన్న జిన్నారం మున్సిపాలిటీలో నాలుగు, జ‌హీరాబాద్‌లో మూడు, ఇంద్రేశంలో రెండు వార్డులను గెలుచుకుంది. ఈ మున్సిపాలిటీలలోను బీజేపీ మ‌ద్ధ‌తు ఉంటేనే చైర్మ‌న్ అయ్యే ప‌రిస్ధితి ఉన్న‌ది. దీంతో ఎవ‌రు చైర్మ‌న్ కావాలన్నా బీజేపీ మ‌ద్ధ‌తు అడాగ‌ల్సిన ప‌రిస్ధితిలో ఉంది. అయితే ఏ ప్ర‌తిపాదిక‌న బీజేపీ మ‌ద్ద‌తు ఇస్తుంది. ఎవ‌రికి ఇస్తుంది? అనేది బీజేపీ నాయ‌క‌త్వం అలోచ‌న‌ల మేర‌కే ఉంటాయని గెలిచిన కౌన్సిల‌ర్లు చెబుతున్నారు. మున్సిపల్  చైర్మ‌న్ ఎంపిక వేదిక‌గా ఎలాంటి పొత్తులు పొడుస్తున్నాయే 16 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Read Also: అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం : బండి సంజయ్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>