Mobile Popup Ad
Mobile Popup Ad

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలి: కలెక్టర్ చంద్రశేఖర్

కలం, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో అంతర్జాతీయ మాతృభూమి దినోత్సవాన్ని (International Mother Earth Day) పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ (Collector Chandrasekhar) కేంద్రీయ విద్యాలయం వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ కేంద్రీయ విద్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Chandrasekhar) మాట్లాడుతూ.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కారణంగా ప్రకృతి తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని హెచ్చరించారు. ప్లాస్టిక్ వల్ల వాతావరణ, జల, భూమి కాలుష్యాలు పెరుగుతున్నాయని, ఇది మనుషులతో పాటు జంతుజాలానికి కూడా ముప్పుగా మారిందని అన్నారు. ప్లాస్టిక్ వినియోగం అనంతరం అది కరుగకపోవడం వల్ల భూమి, పర్యావరణం దెబ్బతింటోందని తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, సాధ్యమైనంత వరకు పూర్తిగా నిషేధించాలని పిలుపునిచ్చారు.

మొక్కలు నాటడం ద్వారా భూమిని సంరక్షించుకోవాలని, అలాగే వాడిన ప్లాస్టిక్‌ను తిరిగి వినియోగించడం, రీసైకిల్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ రాజశేఖర్, జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి శాఖ అధికారి మహమ్మద్ అక్బర్ అలీ, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారందరితో ‘అంతర్జాతీయ మాతృభూమి దినోత్సవ’ ప్రతిజ్ఞ చేయించారు. అలాగే ఈ సందర్భంగా ప్రత్యేక గోడపత్రికను ఆవిష్కరించారు.

Read Also: కల్వకుంట్ల ఫ్యామిలీలో పొలిటికల్ వార్

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>