హైదరాబాద్ సేఫ్ సిటీ.. వైరల్ అవుతున్న యువతి వీడియో!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad) అంటేనే ఓ మినీ ఇండియా. ఉద్యోగం, చదువు, ఉపాధి కోసం ఎంతోమంది మహిళలు ఇక్కడకు వస్తుంటారు. అయితే భాగ్యనగరంలో మహిళల భద్రతపై సహజంగా అనుమనాలుంటాయి. ఈ నేపథ్యంలో ఓ యువతి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్ సిటీ మహిళల భద్రతకు మారుపేరుగా నిలుస్తోందని లీషా అనే యువతి తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంది. ఉద్యోగ నిమిత్తం నగరానికి వచ్చిన ఆమె ఇటీవల ఒకరోజు రాత్రి 11 గంటల సమయంలో సుమారు 4 కిలోమీటర్ల మేర ఒంటరిగా నడిచింది.

ఆ సమయంలో తనకు ఎలాంటి వేధింపులు ఎదురుకాలేదని, కనీసం ఎవరూ అసభ్యంగా కూడా చూడలేదని పేర్కొన్నారు. ఈ ప్రయాణంతో నగరంపై తనకున్న అభిప్రాయం పూర్తిగా మారిపోయిందన్నారు. హైదరాబాద్ ఎంతో సురక్షితమైన ప్రదేశమని కొనియాడారు. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. ఇది నగరంలో శాంతిభద్రతల తీరుకు అద్దం పడుతోంది.

Read Also: 12 ఏళ్లుగా అదే చర్చ జరుగుతోంది.. ఫ్యాన్స్‌కు కోహ్లీ మాజీ ప్రేయసి వార్నింగ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>