Mobile Popup Ad
Mobile Popup Ad

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ (Balka Suman)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల బీఆర్ఎస్ నేతల సమావేశంలో సింగరేణిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో అతనిపై పలు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే పోలీసులు బాల్క సుమన్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు.

ఇటీవల జరిగిన బీఆర్ఎస్ నేతల సమావేశంలో సింగరేణి జీఎం కార్యాలయాన్ని తగలబెట్టాలంటూ బాల్క సుమన్ (Balka Suman) వ్యాఖ్యానించడం తీవ్ర వివాదస్పదమయ్యింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో బాల్క సుమన్ వ్యాఖ్యలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. బాల్క సుమన్ ను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ డీజీపీకి లేఖ రాశారు. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకోవాలని కోరారు. అలాగే ఆయనపై పలు స్టేషన్ లలో నమోదైన కేసుల ఆధారంగా పోలీసులు బాల్క సుమన్‌ను నేడు అదుపులోకి తీసుకున్నారు. బాల్క సుమన్ అరెస్ట్ వార్తతో నాంపల్లి కోర్టు పరిసరాల్లో పోలీసులు బందోబస్తును పటిష్ఠం చేశారు.

Read Also: మహిళతో అసభ్య ప్రవర్తన : కేటరింగ్ కార్మికులకు జైలు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>