కలం, డెస్క్ : చెన్నూరులోని మంత్రి వివేక్ క్యాంప్ ఆఫీసు నుంచే మున్సిపల్ ఎన్నికల్లో డబ్బుల పంపిణీ జరుగుతుందని బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) ఆరోపించారు. సోమవారం ఆయన క్యాతంపల్లిలో మీడియాతో మాట్లాడారు. ‘నేను చివరి రోజు క్యాతంపల్లిలో ఎన్నికల ప్రచారం ముగించుకుని బీఆర్ ఎస్ లీగల్ సెల్ బాధ్యతలు చూసుకుంటున్న అడ్వకేట్ మల్లేశం గౌడ్ ఇంటికి వచ్చాను. మంత్రి వివేక్ ప్రోత్బలంతో ఎమ్మార్వో, పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి రైడ్స్ చేశారు. నన్ను, బీఆర్ ఎస్ నేతలను భయపెట్టేందుకే ఇలాంటి తతంగం నడిపించారు. కానీ ఇక్కడ ఎలాంటి డబ్బులు వారికి దొరకలేదు.
జగన్నాథ లాడ్జ్ లో కాంగ్రెస్ నేతలు డబ్బులు దాచిపెట్టారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో డబ్బులు ఉన్నాయి. అక్కడి నుంచే మంత్రి పీఏ రమణారావు డబ్బులు పంచుతున్నారు. కానీ ఇవేవీ పోలీసులకు కనిపించట్లేదు. బీఆర్ ఎస్ అభ్యర్థులు, కార్యకర్తలను మాత్రం పోలీసులు వేధిస్తున్నారు. మేం ఫిర్యాదులు ఇస్తే కనీసం పట్టించుకోవట్లేదు’ అని బాల్క సుమన్ (Balka Suman) ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: ఘోర ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ట్రాక్టర్
Follow Us On : WhatsApp


