ఘోర ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ట్రాక్టర్

కలం, డెస్క్ : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం శ్రీనగర్ క్రాస్ రోడ్డు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం (Warangal) జరిగింది. స్కూల్ బస్సును ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా.. 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అన్నారం షరీఫ్‌ దర్గాలో కందూరు చేసుకుని ఓ ఫ్యామిలీ ట్రాక్టర్ లో తిరిగి వస్తోంది. ట్రాక్టర్ శ్రీనగర్ క్రాస్ రోడ్డు దగ్గరకు రాగానే.. తీగరాజుపల్లికి చెందిన ప్రైవేట్ స్కూల్ బస్సును వేగంగా ఢీకొట్టింది. ట్రాక్టర్ స్పీడ్ గా ఉండటం వల్ల.. బస్సును ఢీకొట్టగానే బోల్తా కొట్టింది. ప్రమాదంలో డ్రైవర్ తో పాటు ఒక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో 40 మంది స్టూడెంట్లు ఉన్నట్టు సమాచారం. స్టూడెంట్లకు స్వల్ప గాయాలు అయ్యాయని తెలుస్తోంది. ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Read Also: మేడారం హుండీల 5వరోజు ఆదాయం రూ.1.12 కోట్లు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>