కలం, వెబ్‌డెస్క్: సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించనున్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి (Basavatarakam Cancer Hospital)కి నేడు శంకుస్థాపన చేశారు. ఈ ఆస్పత్రి నిర్మాణం కోసం రాజధాని పరిధిలోని తుళ్లూరు సమీపంలో ప్రభుత్వం 21 ఎకరాల భూమిని కేటాయించింది. సుమారు రూ.750 కోట్ల భారీ వ్యయంతో ఈ అత్యాధునిక క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మించనున్నారు. మొదటి దశలో భాగంగా 500 పడకల సామర్థ్యంలో ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన, అత్యాధునిక క్యాన్సర్ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు, ఈ ప్రాంత అభివృద్ధికి దోహద పడేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు వెల్లడించారు.
Read Also: వైసీపీ పాలనలో నవ్వే పరిస్థితి కూడా లేదు: చంద్రబాబు
Follow Us On: X(Twitter)

