కలం, వెబ్ డెస్క్: జార్ఖండ్ రాజధాని రాంచీకి (Ranchi) చెందిన ఏడేళ్ల బాలుడు ఇషాంక్ సింగ్ (Ishank Singh) సముద్ర అలలపై అసాధారణ పోరాటం చేసి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి భారతదేశంలోని ధనుష్కోడి వరకు ఉన్న సుమారు 29 కిలోమీటర్ల పొడవైన ప్రమాదకరమైన పాల్క్ జలసంధిని (Palk Strait) అధిగమించాడు. సముద్రపు నీటిలో ఎదురయ్యే సవాళ్లను, అలల ఉధృతిని తట్టుకుంటూ కేవలం 9 గంటల 50 నిమిషాల వ్యవధిలోనే ఈ లక్ష్యాన్ని చేరుకుని అందరినీ అబ్బురపర్చాడు.
ఈ అద్భుతమైన సాహసంతో ఇషాంక్ సింగ్ (Ishank Singh) ‘యంగెస్ట్ స్విమ్మర్‘ (అత్యంత పిన్న వయస్కుడైన ఈతగాడు)గా యూనివర్సల్ రికార్డ్స్ ఫోరమ్‌లో తన పేరును నమోదు చేసుకున్నాడు. చిన్న వయసులోనే పట్టుదల, క్రమశిక్షణతో ఇషాంక్ చేసిన ఈ కృషిపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రాంచీ బాలుడు భవిష్యత్తులో మరెన్నో అంతర్జాతీయ విజయాలు సాధించాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Read Also: ఆర్టీసీ బస్సులో హైడ్రామా: లంచం అడిగిన అధికారికి దేహశుద్ధి!
Follow Us On: Instagram

