బాలకృష్ణకు లైఫ్ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్ట్!

క‌లం, వెబ్ డెస్క్‌: ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ (IFFD) 2026 వేడుక‌ల్లో టాలీవుడ్ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌ (Balakrishna) లైఫ్ టైమ్‌ అచీవ్‌మెంట్ అవార్డ్ అందుకున్నారు. ఢిల్లీలో బుధ‌వారం రాత్రి ఈ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. దశాబ్దాలుగా సినిమా రంగానికి బాలకృష్ణ చేసిన‌ సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని ప్ర‌క‌టించారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేతుల‌మీదుగా బాల‌కృష్ణ‌కు అవార్డు అంద‌జేశారు. బాలకృష్ణతో పాటు సీనియర్ బాలీవుడ్‌ నటి షర్మిలా ఠాగూర్, దివంగత నటుడు ధర్మేంద్రకు లైఫ్ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు ద‌క్కాయి. ఈ వేడుక‌ల‌కు దేశ వ్యాప్తంగా ప‌లు చిత్ర ప‌రిశ్ర‌మ‌ల నుంచి ప్ర‌ముఖ న‌టులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ మాట్లాడుతూ.. త‌ల్లిదండ్రుల ఆశీర్వాదంతో తాను ఈ స్థాయికి చేరుకున్నాన‌ని, ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో కొన‌సాగుతున్నానంటే వాళ్ల ఆశీర్వాద‌బ‌ల‌మే కార‌ణ‌మ‌ని వ్యాఖ్యానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>