ఈ వేసవిలో ఇంట్లోనే కర్బూజా పండ్లను పండించండిలా!

కలం, వెబ్ డెస్క్: వేసవి కాలంలో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా 90 శాతం నీటిని కలిగి ఉండే కర్బూజా (Muskmelon) ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా సహజమైన కూలర్‌లా పనిచేస్తుంది. అయితే డిమాండ్ కారణంగా మార్కెట్‌లో వీటి ధరలు ఎక్కువగా ఉండవచ్చు. ఈ నేపథ్యంలో, తక్కువ ఖర్చుతో మీ ఇంట్లోనే స్వయంగా కర్బూజా పండ్లనుఎలా పండించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

అనుకూల సమయం, వాతావరణం

కర్బూజా మొక్కలు పెరగడానికి ఎండ చాలా ముఖ్యం. ఎండ తగిలితేనే వీటిలోని స్టార్చ్ చక్కెరగా మారి పండుకు తీపి వస్తుంది. ఫిబ్రవరి చివరి వారం నుండి ఏప్రిల్ వరకు వీటిని నాటడానికి ఉత్తమ సమయం. 25 డిగ్రీల సెంటిగ్రేడ్స్ నుండి 35 డిగ్రీల సెంటిగ్రేడ్స్ ఉష్ణోగ్రత వద్ద ఇవి బాగా పెరుగుతాయి. చలికాలం లేదా వర్షాకాలంలో నాటితే పండ్లు తీపి లేకుండా కేవలం నీరులా మాత్రమే ఉంటాయి. మీకు పెద్ద పెరడు ఉంటే తీగలు పాకడానికి 4 నుండి 6 అడుగుల స్థలం కేటాయించాలి. ఒకవేళ బాల్కనీలో పెంచాలనుకుంటే, కనీసం 12 నుండి 15 అంగుళాల లోతు ఉన్న కుండీని ఎంచుకోవాలి. మొక్క పైకి పాకడానికి కర్రలతో చేసిన ట్రెల్లిస్ (Trellis) అమర్చాలి.

సాగు విధానం:

మట్టి తయారీ: మొక్కకు కావాల్సిన పోషకాల కోసం మట్టిలో కంపోస్ట్ లేదా బాగా మగ్గిన పశువుల ఎరువును కలపాలి.
విత్తనాలు వేయడం: మట్టిలో ఒక అంగుళం లోతున రంధ్రం చేసి 2-3 విత్తనాలు నాటాలి. మొక్కలు కొంచెం పెరిగిన తర్వాత, ఆరోగ్యంగా ఉన్న ఒక మొక్కను ఉంచి మిగిలినవి తొలగించాలి.
నీటి వినియోగం: నీటిని నేరుగా మట్టికే పోయాలి, ఆకులపై చిలకరించకూడదు. ఆకులు తడిస్తే ‘పౌడరీ మిల్డ్యూ’ అనే తెల్లటి శిలీంధ్రం సోకే ప్రమాదం ఉంది. మట్టి ఎప్పుడూ తేమగా ఉండాలి కానీ బురదగా మారకూడదు.
సపోర్ట్ ఉండాలి: బాల్కనీలో పెంచేటప్పుడు పండు బరువుకు తీగ తెగిపోకుండా పాత నెట్ లేదా కాటన్ క్లాత్‌తో ‘స్లింగ్’ లాంటి సపోర్ట్ ఏర్పాటు చేయాలి.

చాలామంది పండ్లను ముందే కోసి తప్పు చేస్తుంటారు. పండు పండిందని గుర్తించడానికి మూడు మార్గాలు ఉన్నాయి. మొదటిది, పండు పైన ఉండే చర్మం ఆకుపచ్చ నుండి లేత గోధుమ లేదా పసుపు రంగులోకి మారుతుంది. రెండోది, తొడిమ భాగంలో మంచి సువాసన వస్తుంది. మూడోది, బొటనవేలితో తొడిమపై స్వల్ప ఒత్తిడి తెచ్చినప్పుడు అది సులభంగా ఊడి వస్తే (స్లిప్ టెస్ట్), పండు కోతకు సిద్ధంగా ఉందని అర్థం. ఒకవేళ బలంగా లాగాల్సి వస్తే అది ఇంకా ప పక్వానికి రాలేదని గమనించాలి. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఈ వేసవిలో మీ సొంత తోటలోని కర్బూజా (Muskmelon) పండ్ల రుచిని ఆస్వాదించవచ్చు.

Read Also: సొరకాయతో అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ..

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>