కలం, సినిమా: నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ఓ వైపు హీరోగా నటిస్తూ.. మరో వైపు నిర్మాతగా రాణిస్తున్నాడు. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రయోగాలే ఎక్కువ చేశారు. ఈ మధ్య కాలంలో బింబిసార అంటూ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత ఏ సినిమా చేసినా కళ్యాణ్ రామ్‌కు కలిసి రావడంలేదు. గత కొన్ని రోజులుగా కళ్యాణ్ రామ్ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఇప్పుడు కొత్త సినిమా ప్రకటించేందుకు ప్లాన్ రెడీ అవుతుందని తెలిసింది. ఇంతకీ.. కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఎప్పుడు..? ఎవరితో..?
కళ్యాణ్ రామ్ (Kalyan Ram) కోసం రైటర్ శ్రీకాంత్ విస్సా ఓ కథ రెడీ చేశారట. ఈ కథను కళ్యాణ్ రామ్‌కు చెబితే బాగుంది చేద్దామన్నారట. అలాగే ఓ కొత్త దర్శకుడు కూడా కళ్యాణ్ రామ్‌కు కథ చెప్పారట. ఈ కథకి కూడా కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. దీంతో రైటర్ శ్రీకాంత్ విస్సా చెప్పిన కథతో సినిమా చేయాలా..? కొత్త దర్శకుడు చెప్పిన కథతో సినిమా చేయాలా..? అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదట. ప్రస్తుతం ఈ రెండు కథలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. రెండు సినిమాల్లో ఒకటి సొంత బ్యానర్‌లో చేసి.. రెండోది తనతో గతంలో సినిమా నిర్మించిన ముప్పా అశోక్ తో చేయాలి అనుకుంటున్నారని సమాచారం.
ఇక నిర్మాతగా భారీ చిత్రం దేవర 2 చేయాల్సివుంది. ఈ సినిమా ఉంటుందా..? ఉండదా..? అనేది సస్పెన్స్ గానే ఉంది. ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ తో చేయాలి అనుకున్న ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో మళ్లీ దేవర 2 తెర పైకి వచ్చింది. కొరటాల ఏమో ఏ స్టార్ హీరో డేట్స్ ఇస్తారా సినిమా స్టార్ట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. మరో వైపు కళ్యాణ్ రామ్ బింబిసార 2 చేయాలి అనుకున్నారు కానీ.. కథ విషయంలో.. డైరెక్టర్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంది. మరి.. త్వరలో కళ్యాణ్ రామ్ తన కొత్త సినిమాల గురించి అనౌన్స్ చేస్తారేమో చూడాలి.


