Mobile Popup Ad
Mobile Popup Ad

బాన్సువాడలో బీఆర్ఎస్‌ను మరింత పటిష్టం చేద్దాం: బాజిరెడ్డి గోవర్ధన్

కలం, నిజామాబాద్ బ్యూరో: బాన్సువాడ (Banswada) నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని మరింత పటిష్టం చేద్దామని.. పార్టీ సభ్యత నమోదు ఆన్‌లైన్‌లో ఉంటుందని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ (Bajireddy Govardhan), మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అన్నారు. ఆదివారం బాన్సువాడ పట్టణంలో జరిగిన సభుత్వ నమోదు సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కోసం కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే సొంత పార్టీ మంత్రులు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీ అనేది రైలు బండి లాంటిదని ఎక్కే వాళ్ళు ఎక్కుతారు దిగేవాళ్ళు దిగుతారని చెప్పారు. ఉద్యమకారుడు కేసీఆర్ నాయకత్వంలో పార్టీ మరింత పటిష్టం అయిందని చెప్పుకొచ్చారు.

సభ్యత్వ నమోదు సక్రమంగా చేపట్టాలని బూత్ నుంచి ఇద్దరు చొప్పున యాక్టివ్ గా పని చేయాలన్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం ఉంటుందని, పార్టీ కోసం ఎవరైతే సమయం కేటాయించి పనిచేస్తారో వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. 14 సంవత్సరాలు పాటు కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం ఉవ్వెత్తున లేచిందని.. బడుగు, బలహీన వర్గాల కోసం కేసీఆర్ పని చేశారన్నారు. ప్రత్యేకంగా మహిళల కోసం వారికి రాజకీయంలో అవకాశం కల్పించేందుకు కృషి చేశారని చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గంలో పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పనిచేసేందుకు సిద్ధమని బాజిరెడ్డి (Bajireddy Govardhan) చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నిలదీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జుబేర్, అంజిరెడ్డి, నార్ల రత్నకుమార్, బీర్కూర్ సర్పంచ్ ధర్మతేజ, రమేష్ యాదవ్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read Also: థాయ్‌లాండ్ ఓపెన్: రన్నరప్‌గా సాత్విక్-చిరాగ్ జోడి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>