Mobile Popup Ad
Mobile Popup Ad

డీజిల్ పోసుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌ మీర్‌‌‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్థిని ఆత్మహత్యకు (Suicide) పాల్పడింది. బడంపేట్‌లోని న్యూ మారుతి నగర్‌కి చెందిన కీర్తి(21) గండిపేట్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీ.టెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఎప్పటిలాగానే కాలేజీకి వెళ్లి, మధ్యాహ్నం ఇంటికి తిరిగొచ్చిన కీర్తి.. కాసేపటికే ఇంట్లో ఉన్న డీజిల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. ఇరుగు పొరుగు వారు స్పందించేలోగానే అప్పటికే తీవ్రమైన గాయాలతో ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి ఆమె సోదరుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>