అయోధ్యలో అద్భుతం.. రామ్ లల్లా నుదుట ‘సూర్య తిలకం’!

కలం, వెబ్ డెస్క్ : ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య (Ayodhya) రామమందిరంలో శ్రీరామ నవమి (Ram Navami) వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రాణప్రతిష్ఠ తర్వాత వచ్చిన మూడో శ్రీరామనవమి కావడంతో ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. అయితే ఈ పవిత్ర పర్వదినాన అయోధ్యలోని భవ్య రామమందిరంలో అద్భుత ఘట్టం (Miracle) ఆవిష్కృతమైంది. బాలరాముడి (రామ్ లల్లా) నుదుటిపై సూర్య కిరణాలు తిలకంలా మెరిసిపోయాయి.ఈ మేరకు మూడో అంతస్తు నుంచి సూర్య కిరణాలు నేరుగా బాలరాముడి నుదుటిపై పడేలా పది మంది సైంటిస్టుల బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అడ్వాన్స్ డ్​ సైంటిఫిక్ టెక్నాలజీ సాయంతో స్పెషల్ సెటప్ డిజైన్ చేయగా.. రామ్ లల్లా నుదుటిపై సూర్య తిలకం అద్భుత దృశ్యాన్ని చూసి భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 3.50 నిమిషాల పాటు ఈ సూర్య తిలకం భక్తులకు కనువిందు చేసింది.సైన్స్, ఆధ్యాత్మికత కలబోతగా జరిగిన ఈ ‘సూర్య తిలకం’ వేడుకను చూసి లక్షలాది మంది భక్తులు పులకించిపోయారు.

సరిగ్గా అభిజిత్ లగ్నంలో సూర్యకిరణాలు రామయ్య నుదుటిపై తిలకంలా ప్రకాశించడంతో ఆలయ ప్రాంగణం ‘జై శ్రీరామ్’ నినాదాలతో మారుమోగిపోయింది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా శ్రీరామనవమి వచ్చే తిథిని, సమయాన్ని అత్యంత ఖచ్చితత్వంతో గణించి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. విద్యుత్ , బ్యాటరీల అవసరం లేకుండా కేవలం కాంతి పరావర్తన సూత్రాల ఆధారంగా ఈ అద్భుతాన్ని ఆవిష్కరించడం విశేషం. సూర్యుడి గమనాన్ని బట్టి ఏటా శ్రీరామనవమి రోజున కచ్చితంగా అదే సమయానికి కాంతి పడేలా ‘గేర్ టీత్ మెకానిజం’ను వినియోగించారు. ఇది గడియారంలోని ముల్లుల మాదిరిగా అద్దాలను ఏడాది పొడవునా స్వల్పంగా కదుపుతూ, మళ్లీ వచ్చే నవమి నాటికి సరైన కోణంలోకి తీసుకువస్తుంది.

Read Also: అమెరికా చరిత్రలో తొలిసారి.. డాలర్ నోట్లపై ట్రంప్ సంతకం

Follow Us On: Instagram

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>