కలం, వెబ్ డెస్క్ : అయోధ్యలోని (Ayodhya) రాజ్‌ఘాట్ వద్ద నిర్వహిస్తున్న మహా యజ్ఞంలో శనివారం భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. శ్రీరామ నవమి సందర్భంగా యజ్ఞం ముగింపు దశలో (పూర్ణాహుతి సమయంలో) హోమ గుండంలో వేసిన కొబ్బరికాయ ఒక్కసారిగా పగిలిపోయింది. దీంతో అందులో నుండి వచ్చిన ఒక నిప్పు రవ్వ పక్కనే ఉన్న బట్టతో చేసిన పందిరికి అంటుకుంది. దీంతో క్షణాల్లో మంటలు వ్యాపించి యజ్ఞశాల మొత్తం దగ్దం అయ్యాయి. ఈ క్రమంలోనే అక్కడ ఏర్పాటు చేసిన 1251 హోమ గుండాలు, యజ్ఞశాల క్షణాల్లో బూడిదయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రమాద (Fire Accident) సమయంలో యూపీ రవాణా మంత్రి దయాశంకర్ సింగ్ సహా పలువురు ఉన్నతాధికారులు అక్కడే ఉన్నప్పటికీ.. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఇదిలాఉంటే అధికారులు మాత్రం ఈ ఘటనపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Read Also: ‘మత్తుబాటు వదలండి.. మైదానాల బాట పట్టండి’ అంటూ సీఎం రేవంత్ పిలుపు
Follow Us On: X(Twitter)

