కలం, వెబ్ డెస్క్: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆటో డ్రైవర్లు (Auto Drivers) శనివారం ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్ల సంఘాల JAC పిలుపునిచ్చాయి. పోలీసులు పలువురు డ్రైవర్లను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. ప్లకార్డులు పట్టుకొని డ్రైవర్లకు సంఘీభావం తెలిపారు.
‘‘ఎన్నికల ముందు తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని గుర్తుచేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో సంఘాల నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికం. హామీలు అమలు చేయకుండా నిర్బంధించి వారి గొంతు నొక్కున్నారు. ఆటో అన్నలు కోరినట్లుగా హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన ఆటో సంఘాల నాయకులను, ఆటో డ్రైవర్లను వెంటనే భేషరతుగా విడుదల చేయాలి’’ అని కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు.
Read Also: ప్రశ్నించమంటే పారిపోయారు.. బీఆర్ఎస్ నేతలకు మంత్రుల కౌంటర్
Follow Us On: Sharechat


