కలం, వెబ్‌డెస్క్: యాషెస్ నాలుగో టెస్ట్‌లో మొదటి రోజు బౌలర్లు పండగ చేసుకున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య (Australia vs England) మెల్బోర్న్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్ట్‌లో రెండు జట్ల మొదటి ఇన్నింగ్స్ తొలి రోజే ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 45.2 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బౌలర్ నెసర్(35) టాప్ స్కోరర్. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీయగా, అట్కిన్సన్ 2, బ్రైడన్ కార్స్, స్టోక్స్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 29.5 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్ అయ్యింది. హ్యారీ బ్రూక్ టాప్ స్కోరర్ (41). ఆ జట్టులో ఎనిమిది మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యారు. ఆసిస్ బౌలర్లలో నెసర్ 4, బోలాండ్ 3, స్టార్క్ 2 వికెట్లు తీశారు. గ్రీన్ 1 వికెట్ పడొట్టాడు.రెండో ఇన్సింగ్స్‌లో ఆసిస్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది.
Read Also: స్టూడెంట్ చేసిన పనికి రోహిత్ శర్మ ఎమోషనల్..
Follow Us On: X(Twitter)


