రైతు అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత: అచ్చెన్నాయుడు

కలం, వెబ్ డెస్క్: రైతు అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల ఉన్నతాధికారులతో అచ్చెన్నాయుడు ఉమ్మడి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే ఖరీఫ్ సీజన్‌ (AP Kharif Season)ను అత్యంత సమర్థవంతంగా నిర్వహించడం, విత్తనాలు, ఎరువుల లభ్యత, కాలువల మరమ్మతులపై సుదీర్ఘంగా చర్చించి సాగునీటి విడుదల షెడ్యూల్‌ను ఖరారు చేశారు.

సమావేశానంతరం ఆయా ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టుకు నీటి విడుదల షెడ్యూల్ విడుదల చేశామని చెప్పారు. పెన్నా డెల్టాకు ఇప్పటికే మే 4వ తేదీ నుండి సాగు నీటిని విడుదల చేయడం జరిగిందని తెలిపారు. గోదావరి డెల్టాకు జూన్ 1 నుండి, గాలేరు-నగరి సుజల స్రవంతి కింద ఉన్న ఆయకట్టుకు జూన్ 10 నుండి, టిజిపి కడపకు జూన్ 15 నుండి, వంశధార ఆయకట్టుకు జూన్ 15 నుండి, తోటపల్లి ఆయకట్టుకు జూలై 1 నుండి, కృష్ణా డెల్టా ఆయకట్టుకు జూలై 1 నుండి, ఏలేరు రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టుకు జూలై 10 నుండి సాగునీరు విడుదలవుతుందని స్పష్టం చేశారు.

కేసి కెనాల్, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బిసి, టిబిపిఎల్‌ఎల్‌సి, తాడిపూడి, పుష్కర ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టుకు జూలై 15 నుండి నీటిని విడుదల చేస్తామన్నారు. టిబిపిహెచ్‌ఎల్‌సి కింద ఉన్న ఆయకట్టుకు జూలై 20 నుండి, హంద్రీనీవా సుజలస్రవంతి ఆయకట్టుకు జూలై 31 నుండి నీటిని అందిస్తాం. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద జోన్-1 పరిధిలోని పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలకు జూలై 31న, జోన్-2 పరిధిలోని ప్రకాశం, మార్కాపురం ఆయకట్టుకు ఆగష్టు చివరి వారంలో సాగునీటిని విడుదల చేయనున్నామని వివరించారు.

పూడికతీత పనులకు రూ.397 కోట్ల..

కాలువల్లో తూడు, గుర్రపుడెక్క, పూడికతీత వంటి అత్యవసర పనుల కోసం ప్రభుత్వం రూ.397 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు. ఈ పనులన్నీ మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. జూన్ 1వ తేదీ నుంచే కాలువలకు నీటిని విడుదల చేస్తున్నాం కాబట్టి రైతు సోదరులంతా సాగుకు సిద్ధం కావాలని కోరారు. గత ఖరీఫ్ సీజన్ లో 99.35 లక్షల ఎకరాలకు 888 TMCల నీటిని, రబీ సీజన్ లో 23.67 లక్షల ఎకరాలకు 153 TMCల నీటిని అందించడం జరిగిందన్నారు. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయ, జలవనరుల శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌ను విజయవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.

Read Also: రాయలసీమ లిఫ్ట్‌పై ఉద్యమ కార్యాచరణ.. సజ్జల దిశానిర్దేశం

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>