దారుణం.. అప్పు తీర్చలేక 45 ఏళ్ల వ్యక్తితో బిడ్డ పెళ్లి చేసిన తండ్రి

కలం, జనగామ : జనగామ (Jangaon) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నాటి కన్యాశుల్కాన్ని తలపిస్తున్న యువతి విక్రయ ఘటన కలకలం రేపింది. బచ్చన్నపేట కు చెందిన ఓ వ్యక్తి బీఆర్ఎస్ లీడర్ దగ్గర 20 లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చడం కష్టం కావడంతో సదరు లీడర్ తన 18 ఏళ్ల బిడ్డ ను ఇచ్చి పెళ్లి చేయాలని కోరాడు. దీంతో ఆ వ్యక్తి రెండో భార్య 18 ఏళ్ల సవతి బిడ్డను అప్పు ఇచ్చిన 45 ఏళ్ల ప్రశాంత్ రెడ్డి కి ఇచ్చి పెళ్లి చేసింది. స్నేహితుల సహాయంతో ప్రశాంత్ రెడ్డి నుండి తప్పించుకున్న బాధితురాలు హైదరాబాద్ లో మహిళా కమిషన్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. అప్పు తీర్చేందుకు తన తండ్రి సవతి తల్లితో కలిసి ప్రశాంత్ రెడ్డికి ఇచ్చి బలవంతపు పెళ్లి చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు స్పందించిన మహిళా కమిషన్ ఈ ఘటన పై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.

Read Also: బీఆర్ఎస్‌కు ఆక్సిజ‌న్‌లా బండి భగీరథ్ పోక్సో కేసు!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>