పాకిస్థాన్(Pakistan)లో ఘోర విషాదం చోటుచేసుకుంది. పంజాబ్ ప్రావిన్స్‌లోని ఫైసలాబాద్(Faisalabad)లో గమ్ తయారీ చేసే ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో శుక్రవారం ఉదయం భారీ బాయిలర్ పేలుడు సంభవించింది. అకస్మాత్తుగా పేలిన ఈ బాయిలర్ ధాటికి ఫ్యాక్టరీ మొత్తం కంపించిపోయింది. పేలుడు శబ్దం దాదాపు కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ వినిపించినట్లు అక్కడి స్థానికులు తెలిపారు.
ఈ దుర్ఘటనలో కనీసం 15 మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని తక్షణమే సమీపంలోని అలైడ్ ఆస్పత్రి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌లకు తరలించారు. గాయాల తీవ్రత వల్ల మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు.
Pakistan | పేలుడు జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులు చాలా మంది బాయిలర్ ప్రాంతానికి సమీపంలో ఉన్నట్టు సమాచారం. దాంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని రక్షణ సిబ్బంది చెప్తున్నారు. ఈ ఘటన తరువాత ఫైసలాబాద్ రెస్క్యూ టీములు, అగ్నిమాపక దళం భారీగా ఘటనాస్థలానికి చేరుకొని శకలాల మధ్య చిక్కుకున్న వారిని బయటకు తీశారు. మంటలు పెద్ద ఎత్తున చెలరేగకపోవడం పెద్ద విషాదాన్ని మరింత పెరగకుండా కాపాడింది. ఇక పేలుడు కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బాయిలర్‌లో ప్రెషర్ అధికమై ఉండడం వల్ల అయి ఉండొచ్చని అనుమానిస్తున్నా, ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అన్నది కూడా విచారణలో కీలక అంశంగా మారింది.
Read Also: అమెరికాకు విదేశీ ఉద్యోగులు కావాలి: ట్రంప్
Follow Us on : Pinterest


