Mobile Popup Ad
Mobile Popup Ad

అమెరికాకు విదేశీ ఉద్యోగులు కావాలి: ట్రంప్

విదేశీ ఉద్యోగుల అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్లేట్ ఫిరాయించేశారు. రెండోసారి అధ్యక్షపదవి చేపట్టినప్పటి నుంచి ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు. టారిఫ్‌లు విధిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నారు. అదే సమయంలో తమ దేశంలో ఉంటున్న విదేశీ ఉద్యోగులు, అమెరికాకు చదువుకోవడం కోసం వచ్చే విదేశీ విద్యార్థులపై తీవ్ర ఆంక్షలు విధించారు. హెచ్‌-1బీ వీసాల ఫీజులను కూడా భారీగా పెంచేశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాలతో పలు దేశాలకు చెందిన విద్యార్థులు, అమెరికాలో ఉద్యోగం చేస్తున్న చాలా మంది విదేశీ ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే తాజాగా విదేశీ ఉద్యోగుల విషయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. అమెరికా విజయానికి విదేశీ ఉద్యోగులు చాలా అవసరమని ఆయన అంగీకరించారు.

ఇటీవల జరిగిన అమెరికా(US)–సౌదీ(Saudi) పెట్టుబడుల సదస్సులో ఆయన ఇంతకాలం అవలంబిస్తున్న తీరుకు భిన్నమైన అభిప్రాయాలను వెల్లడించారు. అమెరికా అభివృద్ధికి విదేశీ నైపుణ్య ఉద్యోగులు అత్యవసరమని ట్రంప్(Donald Trump) స్పష్టం చేశారు. పెద్దపెద్ద కంపెనీల్లో బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి, వారి నిపుణుల బృందాలతో సహా స్వాగతం ఉంటుందని చెప్పారు. అలా చేస్తేనే పరిశ్రమలు పురోగతిచెందుతాయని పేర్కొన్నారు. విదేశీ నిపుణులు తమతో పాటు తీసుకురాబోయే వృత్తి నిపుణులు అమెరికన్లకు ఆధునిక నైపుణ్యాలు నేర్పించాలని అన్నారు. ఆ తర్వాత తమ దేశాలకు తిరిగి వెళ్లగలరని సూచించారు. అమెరికా విజయయాత్రకు ప్రపంచ ప్రతిభ కూడా అవసరమేనని ఆయన వ్యాఖ్యానించారు.

Read Also: పట్టుకుని కాల్చి చంపారు : మావోయిస్టు పార్టీ

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>