epaper
Monday, March 2, 2026
epaper

పార్టీపరంగా బీసీలకు 42% రిజర్వేషన్… కాంగ్రెస్ కీలక నిర్ణయం

కలం డెస్క్ : స్థానిక సంస్థల ఎన్నిక(Local Body Polls)ల్లో మొత్తం రిజర్వేషన్ 50 శాతానికి మించకూడదని న్యాయస్థానాలు స్పష్టం చేయడంతో బీసీలకు పార్టీపరంగా 42% రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్(Congress) సిద్ధమవుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ నెల 25న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం జరగనున్నది. ప్రస్తుతానికి నాలుగు అంశాలతో ఎజెండా ఖరారైంది. మరికొన్ని అంశాలు టేబుల్ ఎజెండాగా చేరనున్నాయి. ఖరారైన ఎజెండాలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అంశంతో పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, విద్యుత్ రంగంలో పట్టణ ప్రాంతానికి కొత్త డిస్కం ఏర్పాటు, దానికి అనుగుణంగా ఇప్పటికే ఉన్న రెండు డిస్కంల వర్క్ డివిజన్, యాదగిరిగుట్ట దేవస్థానానికి ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు తదితరాలు ఉన్నాయి.

వచ్చే నెల 7వ తేదీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమం షెడ్యూలు, కొత్త స్కీమ్‌ల లాంఛింగ్, దానికి అనుగుణంగా విడుదల చేయాల్సన మార్గదర్శకాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, వచ్చే నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, ఇందులో పాల్గొనడానికి వచ్చే దేశ, విదేశీ కంపెనీల ప్రతినిధులు, వారికి చేయాల్సిన వసతి సౌకర్యాలు, నిర్వహణకు చేపట్టనున్న ఏర్పాట్లు తదితరాలపైనా క్యాబినెట్ భేటీలో చర్చ జరగనున్నది. స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Polls) నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయాల్సిన నోటిఫికేషన్ (షెడ్యూలు), దానితో పాటే వచ్చే ఎన్నికల కోడ్‌తో కొత్త పథకాల లాంచింగ్‌కు తలెత్తనున్న చిక్కులు.. వీటిపైనా క్యాబినెట్ చర్చించనున్నది.

Read Also: అరెస్టు చేసేంత ధైర్యం సీఎం రేవంత్‌కు లేదు

Follow Us on : ShareChat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!