Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ బడ్జెట్ స్పెషల్ : ప్రతీ కుటుంబానికి భరోసా

కలం, తెలంగాణ బ్యూరో : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి భరోసా కల్పించేలా వార్షిక బడ్జెట్‌ (Telangana Budget 2026-27)ను రూపొందించింది. చంటిబిడ్డ మొదలు వృద్ధుల వరకు అన్ని సెక్షన్ల ప్రజలకు ధీమా కల్పించేలా సంక్షేమ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. మొత్తం రూ. 3.24 లక్షల కోట్ల బడ్జెట్‌లో దాదాపు రూ. 1.04 లక్షల కోట్లను సంక్షేమానికే వెచ్చిస్తున్నది. మొత్తం ఖర్చులో ఇది మూడవ వంతు. ఆరు గ్యారంటీల అమలుకే రూ. 50 వేల కోట్లకు పైగా కేటాయించింది. చిన్నారులు, విద్యార్థులు, యువత, చేనేత, మహిళలు, వృద్ధులు, ఆదివాసీ-గిరిజనులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. ఇలా అన్ని సెక్షన్ల ప్రజలనూ గమనంలోకి తీసుకున్నది. సంక్షేమానికి చిరునామాగా బడ్జెట్‌ను రూపొందించింది. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి ఉచితంగా జీవిత బీమాను కల్పించింది. ప్రీ-ప్రైమరీ స్కూల్ మొదలు జూనియర్ కాలేజీ వరకు ఉచిత బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రవేశపెడుతున్నది. ఇందుకోసం బడ్జెట్‌లోనూ నిధులను కేటాయించింది.

చరిత్రలోనే ఫస్ట్ టైమ్ ‘అందరికీ బీమా’ :

రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి ధీమా కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచిత జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించింది. ఏదేని పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడకూడదన్న లక్ష్యంతో ఐదు లక్షల రూపాయల మేర ఆర్థిక సాయం అందేలా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకా’న్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జూన్ 2న ఆవిర్భావ దినోత్సవం నుంచి ఇది దీన్ని అమలులోకి రానున్నది.

ఇంటర్ కూ బ్రేక్ ఫాస్ట్, మిడ్ డే మిల్స్

రాష్ట్రంలోని రాష్ట్రంలోని ప్రీ-ప్రైమరీ పాఠశాల మొదలు జూనియర్ కాలేజీ వరకు అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అందించనున్నది. ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం కూడా అమల్లోకి రానున్నది. ఈ రెండూ రానున్న విద్యా సంవత్సరం (జూన్) నుంచి అమలవుతాయి. ప్రస్తుతం అమలవుతున్న ‘చేయూత’ స్కీమ్‌లో కొత్తగా అర్హులైన రెండు లక్షల మందికి లబ్ధి చేకూరనున్నది. దీనికి తోడు ఐటీఐ (అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు)లలో ట్రైనీలుగా శిక్షణ పొందుతున్న ప్రతీ ఒక్కరికి నెలకు రూ. 2 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు అందనున్నాయి. స్పెషల్ పేజ్ చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Telangana Budget 2026
Telangana Budget 2026

Read Also: తెలంగాణ బడ్జెట్‌లో 5 కొత్త పథకాలు ఇవే..!

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>