Mobile Popup Ad
Mobile Popup Ad

భట్టిది బోగస్ బడ్జెట్.. జూటా బడ్జెట్: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్రంగా స్పందించారు. భట్టి బడ్జెట్ బోగస్ బడ్జెట్ అని, జూటా బడ్జెట్ అని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. బడ్జెట్ ద్వారా ఆరు గ్యారెంటీలకు కాంగ్రెస్ నేతలు సమాధి కట్టారని ఆయన ఫైర్ అయ్యారు. గతంలో నిధులు ఖర్చు చేయని పథకాలకు మళ్ళీ నిధులు కేటాయించారని అన్నారు. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను గత బడ్జెట్ లో ప్రస్తావించి నిధులు కేటాయించలేదన్నారు. ఇప్పుడు మళ్ళీ అవ్వే పథకాలకు నిధులు కేటాయింపులు చేశారని హరీశ్ రావు అన్నారు.

Read Also: తెలంగాణ బడ్జెట్ స్పెషల్ : ప్రతీ కుటుంబానికి భరోసా

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>