కలం, వెబ్ డెస్క్ : యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Assembly Election Results 2026) కాసేపట్లో వెలువడనున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ లో కాంగ్రెస్ డీలా పడిపోయింది. దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న హస్తం పార్టీ ఇప్పటి వరకు ఐదు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలకు ప్రధాన పోటీ నెలకున్న ఈ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ ఓట్ల లెక్కింపులో కేంద్రంలో ఉన్న బీజేపీ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణముల్ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. ఉదయం నుంచి కొనసాగుతున్న లెక్కింపులో ఆధిక్యంలో బీజేపీ, టీఎంసీలు కొట్లాడుకుంటున్నాయి. బెంగాల్ లో 294 స్థానాలకు గానూ బీజేపీ 165 చోట్లకు పై గా లీడ్ లో ఉంటే.. టీఎంసీ 120 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. జాతీయ కాంగ్రెస్ మాత్రం కేవలం 3 సీట్లకు మాత్రమే పరిమితమైంది.
కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఆధిక్యం సాగుతోంది. ఎల్డీఎఫ్ 44, యూడీఎఫ్ 94 స్థానాల్లో లీడ్ లో ఉంది. మరోవైపు ఎన్డీఏ కూటమి 2 స్థానాల్లో ముందంజలో ఉంది. అటు అస్సాంలో బీజేపీ దూసుకుపోతోంది. బీజేపీ 98 సీట్ల ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ మాత్రం వెనుకంజ పట్టి 25 సీట్లలో లీడ్ లో ఉంది.
తమిళనాడులో దళపతి విజయ్ టీవీకే పార్టీ ఊహించని రీతిలో ముందంజలో ఉంది. 97 స్థానాల లీడ్ తో అధికార డీఎంకేను వెనక్కి నెట్టింది. డీఎంకేకు 61 సీట్లలో ఆధిక్యం రాగా, అన్నాడీఎంకేకు 75 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. కేంద్రపాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరి అసెంబ్లీ ఫలితాలలో ఎన్నార్ కాంగ్రెస్ 16, కాంగ్రెస్ 9 స్థానాల్లో ఉండగా టీవీకే, బీజేపీలు ఇంకా ఖాతా తెరవలేదు.
కాగా, దేశ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న కాంగ్రెస్.. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఇలాంటి సమయంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో వెనుకంజలో ఉండడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫలితాల ప్రభావం రాబోయే ఎంపీ ఎన్నికలపై పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ కు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గట్టిగానే షాక్ ఇవ్వనున్నాయి.
Read Also: తమిళనాడులో సంచలనం.. ఓటమి దిశగా సీఎం స్టాలిన్, ఉదయనిధి!
Follow Us On: X(Twitter)

