విజయం దిశగా TVK: విజయ్ నివాసం వద్ద భద్రత పెంపు!

కలం, వెబ్​ డెస్క్​ : తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK Vijay) అంచనాలకు మించి రాణిస్తూ రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం టీవీకే అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి ఎన్నికల్లోనే విజయ్ పార్టీ ఈ స్థాయిలో ప్రభావం చూపుతుండటంతో అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు అభిమానుల్లోనూ ఒక్కసారిగా జోష్ పెరిగింది.

ఈ భారీ విజయ సంకేతాల నేపథ్యంలో చెన్నైలోని విజయ్ (TVK Vijay) నివాసం వద్ద కోలాహలం నెలకొంది. తమ అభిమాన నేతను చూసేందుకు, విజయోత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విజయ్ ఇంటి వద్ద, టీవీకే కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను రంగంలోకి దించి, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.

Read Also: కౌంటింగ్ : ఏ రాష్ట్రంలోనూ ప్రభావం చూపని కాంగ్రెస్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>