కలం, వెబ్ డెస్క్ : లోక్ సభలో ఏపీ రాజధానికి అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం లభించింది. ఈ సందర్బంగా రాజ్యసభలో ఆప్ పార్టీ బిల్లుకు మద్ధతు తెలిపింది. ఈ సందర్భంగా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ (Sanjay Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ (BJP) అనేక పార్టీలను మోసం చేసిందని.. ఇది చరిత్ర అని చెప్పుకొచ్చారు. బీజేపీ విషయంలో టీడీపీ (TDP) జాగ్రత్తగా ఉండాలని సంజయ్ హెచ్చరించారు. ప్రస్తుతం ఏపీలో అధికారం చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉందని.. కేంద్రం నుంచి ఎంత రాబట్టుకోవాలో అంత రాబట్టుకోవాలి అని సూచించారు. అలాగే, లోక్ సభలో జరిగిన చర్చలో సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర కూడా టీడీపీకి కీలక సూచనలు చేశారు. బీహార్ లో నితీశ్ కుమార్ ను దింపేసినట్లే.. ఏపీలో చంద్రబాబు నాయుడిని కూడా బీజేపీ దింపేస్తుందని జోస్యం చెప్పారు. బీజేపీ పార్టీని నమ్మొద్దని ఆయన హెచ్చరించారు.
Read Also: విజయ్ ర్యాలీలో మరో ప్రమాదం.. పోలీసు కాలిపైకి దూసుకెళ్లిన కారు
Follow Us On : WhatsApp

