Mobile Popup Ad
Mobile Popup Ad

అమెరికా – ఇరాన్ చర్చలు.. జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : అమెరికా – ఇరాన్ (US – Iran) ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన శాంతి చర్చలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు పాకిస్తాన్ లో జరగుతున్న శాంతి చర్చల సందర్భంగా అమెరికా ముందుకు వచ్చిందని, తదిపరి అడుగు వేయాల్సింది ఇరాన్ మాత్రమేనని వాన్స్ వెల్లడించారు. రెండు రోజుల పాటు జరిగిన శాంతి చర్చల్లో అమెరికా, ఇరాన్ ల మధ్య ఒప్పందం కుదరలేని విషయం తెలిసిందే. అణ్వాయుధాలను తయారు చేయకూడదనే నిబంధనను ఇరాన్ అంగీకరించకపోవడంతోనే చర్చలు విఫలమయ్యాన్నారు.

ఈ క్రమంలో ఇరు దేశాల (US – Iran) మధ్య తదుపరి చర్చలకు తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయని జేడీ వాన్స్ స్పష్టం చేశారు. చర్చల్లో తాము చాలా పురోగతిని సాధించినట్లు చెప్పారు. కానీ ఇరాన్ తగినంత దూరం వెళ్లలేదని ఇప్పుడు బంతి ఇరాన్ కోర్టులో ఉందని వాన్స్ స్పష్టం చేశారు. ఇరాన్ అణు ఆశయాలపై అమెరికా విధించిన పరిమితులు నెరవేరితే ఒప్పందం కుదురుతుందన్నారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదన్న విషయంలో అధ్యక్షుడు ట్రంప్‌ భావనతో తాను బలంగా ఏకీభవిస్తున్నానని జేడీ వాన్స్ తేల్చి చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>