Mobile Popup Ad
Mobile Popup Ad

రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు.. కీలక అప్‌డేట్

కలం, వెబ్ డెస్క్: ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల (Municipal Elections) నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని 87 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన ప్రక్రియను కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ఎన్నికల అధికారులు యోచిస్తున్నారు. ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి మొత్తం 3,206 వార్డులు, డివిజన్లు ఉన్నాయి. కొత్తగా మరో 736 వార్డులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో మొత్తం వార్డుల సంఖ్య 3,942కు చేరుకోనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డులు, డివిజన్ల పునర్విభజన చేస్తున్నారు. కొత్త వార్డుల ప్రకటన అనంతరం ఎన్నికల నిర్వహణ తేదీలపై క్లారిటీ రానుంది. అటు పెరిగిన జనాభాకు అనుగుణంగా వార్డుల సరిహద్దులను మార్చడం, ఓటర్ల సంఖ్యను సమతుల్యం చేయడం వంటి అంశాలపై అధికారులు నిమగ్నమయ్యారు.

వార్డుల పునః విభజన ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేసి ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. డీలిమిటేషన్ (Delimitation) ముగిసిన వెంటనే ఓటర్ల జాబితా తయారీ, రిజర్వేషన్లను అమలు చేయడం వంటి కీలక అంశాలపై అధికారులు సన్నద్ధం అవుతున్నారు. మరోవైపు, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న మరో 23 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి కోర్టుల్లో నమోదైన కేసులపై తుది తీర్పు వెలువడిన తర్వాతే ఆయా చోట్ల ఎన్నికల నిర్వహణపై ఎన్నికల అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>