epaper
Monday, November 17, 2025
epaper

ఫ్యాన్సీ నెంబర్ ప్రియులకు షాక్

కలం డెస్క్ : Fancy Number Prices | కొత్తబండితో పాటు ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉండాలని కోరుకునేవారు చాలామందే ఉంటారు. ఫ్యాన్సీ నెంబర్లు కావాలనుకోవడం ఒక హాబీ. ఈ నెంబర్ల కోసం లక్షల రూపాయలైనా వెనకాడరు. కొన్ని సందర్భాల్లో వాహన ధరలో సగం వెచ్చించి సొంతం చేసుకోవాలనుకునేవారూ ఉన్నారు. ఇలాంటి ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా రాష్ట్ర రవాణా శాఖకు ఏటా సగటున రూ. 60 కోట్ల మేర ఆదాయం సమకూరుతూ ఉంది. వాహన ప్రియుల సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర సర్కార్ వాటి ధరలను పెంచింది. నవంబరు 15 నుంచే కొత్త విధానం అమలులోకి వచ్చింది. ఇకపైన ఫ్యాన్సీ నెంబర్లు కావాలనుకునేవారు గతంకంటే ఎక్కువ ధరను చెల్లించక తప్పదు.

ఆల్ నైన్ నెంబర్ కనీస ధర లక్షన్నర :

కొత్త వాహనానికి 9999 నెంబర్ కావాలనుకుంటే ఇకపైన కనీస ధరగా రూ. 1.50 లక్షను చెల్లించాల్సిందే. ఈ నెంబర్ కోసం ఒకరికంటే ఎక్కువ మంది పోటీ పడితే ఆ రోజున రవాణా శాఖ నిర్వహించే వేలంలో ఎవరు ఎక్కువ ధరను కోట్ చేస్తే వారికే సొంతమవుతుంది. ఇందుకోసం ముందుగానే ఆన్‌లైన్‌లో రవాణా శాఖ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో లక్షన్నర కనీస ధరలో 10% అడ్వాన్సుగా చెల్లించాలి. వేలంలో పాల్గొన్నా పాల్గొనకపోయినా అడ్వాన్సుగా చెల్లించిన డబ్బు తిరిగి వాపస్ రాదు. ఒక్కో నెంబర్‌కు ఒక్కో తరహాలో కనీస ధరను రవాణా శాఖ నిర్ణయించింది. ఇందుకోసం గతంలోని జీవోకు సవరణలు చేస్తూ తాజాగా ఉత్తర్వులిచ్చింది.

ఫ్యాన్సీ నెంబర్ కోసం కనీస ధరలు ఇవే :

ధర : ఫ్యాన్సీ నెంబర్లు
రూ. 1,50,000 : 9999
రూ. 1,00,000 : 6666
రూ. 1,00,000 : 0001, 0009
రూ. 50,000 : 99, 999, 3333, 4444, 5555, 7777
రూ. 40,000 : 5, 6, 7, 123, 333, 369, 555, 666, 777, 1111, 1116, 1234, 2222, 2277, 2345, 2727, 3339, 3366, 3456, 3699, 4455, 4545, 4599, 6669, 6789, 8055, 8888
రూ. 30,000 : 3, 111, 234, 567, 1188, 1818, 1899, 2799, 3636, 3999, 5678, 5999, 6999, 7999, 9099
రూ. 20,000 : 2, 4, 8, 11, 18, 27, 36, 39, 45, 55, 77, 143, 222, 405, 444, 456, 459, 786, 789, 909, 1112, 1122, 1212, 1233, 1269, 1314, 1359, 1889, 2223, 2255, 2259, 2349, 2525, 3335, 3344, 3399, 3555, 3789, 3888, 3969, 4446, 4554, 4567, 4777, 4959, 5445, 5559, 5589, 5599, 5666, 5679, 5859, 6336, 6699, 6777, 6786, 6969, 7779, 7799, 7979, 8889, 8899, 8999, 9099
రూ. 6,000 : పైన పేర్కొన్న నెంబర్లు కాకుండా ఇతర నెంబర్లను రిజర్వు చేసుకోవాలనుకుంటే రూ. 6,000 కట్టాలి. ఒకవేళ మోటార్ సైకిల్ (టూ వీలర్)కు నెంబర్ ను రిజర్వు చేసుకోవాలనుకుంటే రూ. 3,000 కడితే సరిపోతుంది. ఒకవేళ ప్రస్తుతం వాడుతున్న వాహనాన్ని ఇకపైన వినియోగించకుండా స్క్రాప్‌లోకి పంపితే అదే నెంబర్‌ను కొత్త వాహనానికి వాడుకోవాలనుకుంటే రూ. 2,000 చెల్లించి రిజర్వు చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకోడానికి అనుసరించాలనుకున్న కొన్ని విధానాల్లో ఒకటిగా రవాణా శాఖలో ఫ్యాన్సీ నెంబర్ కనీస ధరలను(Fancy Number Prices) పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.

ఒక్క నెంబర్‌కు రూ. 21.60 లక్షలు :

ఫ్యాన్సీ నెంబర్లపై ఉన్న క్రేజీతో సంపన్నులు, ప్రముఖ కంపెనీలు లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తాయి. గతంలో (2023 ఆగస్టులో) ఒక్క రోజులోనే ఫ్యాన్సీ నెంబర్ల ద్వారా రాష్ట్ర రవాణా శాఖకు రూ. 53 లక్షల ఆదాయం వచ్చింది. ఉదాహరణకు 9999 నెంబర్‌ను సొంతం చేసుకోడానికి ఓ ప్రైవేటు కంపెనీ రూ. 21.60 లక్షలను ఖర్చు చేసింది. ఏ నెంబర్‌ను ఎంతకు కొన్నారో వివరాలను పరిశీలిస్తే…

9999 : రూ. 21.60 లక్షలు – ప్రైమ్ సోర్స్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
0009 : రూ. 10.50 లక్షలు – మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్
0001 : రూ. 3.01 లక్షలు – ఆంధ్రా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రై. లి.
0006 : రూ. 1.83 లక్షలు – గాయజ్ జువెల్లరీ ప్రై.లి.

Read Also: కవిత ఆరోపణల్లో వాస్తవం లేదు…ఎమ్మెల్సీ నవీన్

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>